యాదాద్రిలో ఆంజనేయస్వామికి ఆకుపూజ


Wed,September 18, 2019 02:21 AM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి క్షేత్రపాలకుడైన ఆం జనేయస్వామికి మంగళవారం ఆకుపూజ ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామిని శ్రీచందనంతో అలంకరించారు. జిల్లేడు పూలు, తమలపాకులతో అర్చన చేశా రు. ఆంజనేయస్వామికి ఇష్టమైన తినుబండాగారాలను నైవేధ్యంగా సమర్పించారు. వడ పప్పు, బూరెలు, అరటి పండ్లు తదితర పదార్థాలను సమర్పించి హనుమాన్‌చాలిసా పఠించారు. కార్యక్రమాలను ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఉపప్రధానార్చకులు కాం డూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం ఆధ్వ ర్యంలో నిర్వహించారు.

ఖజానాకు రూ.5,29,936ఆదాయం
శ్రీవారికి ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 34,952, 100 రూపాయల దర్శనం టిక్కెట్‌తో రూ. 13,000, వ్రత పూజలతో రూ.12,500, ప్రసాద విక్రయాలతో రూ. 2,15,125, శాశ్వత పూజలతో రూ. 20,230, అన్న ప్రసాదం ద్వారా రూ. 1,11,949తో పాటు అన్ని విభాగాల నుంచి రూ. 5,29,936 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆదాయశాఖ అధికారులు తెలిపారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...