సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


Wed,September 18, 2019 02:21 AM

- యురేనియం తవ్వకాలకు అనుమతి నిరాకరణపై హర్షం
పెద్దఅడిశర్లపల్లి : యురేనియం అలజడితో ఆందోళనలో ఉన్న పెద్దగట్టు గ్రామ ప్రజలు ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు. యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చేది లేదని సీఎం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం పెద్దగట్టు సర్పంచ్ నరేందర్‌నాయక్ ఆధ్వర్యంలో గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మట్లాడుతూ నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరుపుతారనే పుకార్లలో తాము తీవ్ర ఆందోళన చెందినట్లు తెలిపారు. తవ్వకాలకు తాము అనుమతించమని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో తమకు కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు సీతారాంనాయక్, లాలునాయక్, తదితరులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...