పల్లె ప్రగతిలో భాగస్వాములవ్వాలి


Wed,September 18, 2019 02:21 AM

- కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
- జిప్తివీరప్పగూడెంలో స్థానిక ప్రతినిధులతో కలిసి మొక్కల నాటింపు
మిర్యాలగూడ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 30 రోజుల పల్లె ప్రగతి ప్రణాళికలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పిలుపునిచ్చారు. 30 రోజుల పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మండలంలోని జప్తివీరప్పగూ డెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ పేలప్రోలు శ్రీలత హరిబాబు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యవంతుడే అందరికంటే అదృష్టవంతుడని, ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాలని సూచించారు. వీధుల్లో చెత్త వేయవద్దని, రోడ్లవెంట వీలైనన్ని మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. మొక్కలు పెంచితేనే కాలుష్యం బారిన పడకుండా ఉంటామన్నారు. అనంతరం జడ్పీ పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేఎంవీ జగన్నాథరావు, ఎంపీడీఓ దేవిక, జడ్పీటీసీ తిప్పన విజయసింహరెడ్డి, ఎంపీపీ నూకల సరళ, మాజీ ఎంపీపీ తిరుపతమ్మ, ఎంపీటీసీ వంకాయలపాటి రత్నకుమారి, చలపతిరావు, జగడం ప్రసాద్, సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...