యాదాద్రిలో భక్తుల సందడి


Mon,September 16, 2019 03:40 AM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు, మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోమారు పోటెత్తింది. ఎటు చూసి నా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కు టుం బ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూకట్టారు. తెల్లవారు జాము 3 గంటల నుంచి ఆరాధనలు ప్రారంభించారు. సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేకపూజలు చేశారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను గజవాహనంపై ముఖమండపంలోనే ఊరేగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం, నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణస్వామి సామూహిక వ్రత పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ.2,00,500 ఆదాయం సమకూరింది.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...