విద్యుదాఘాతంలో వ్యక్తి మృతి


Sun,September 15, 2019 01:46 AM

నార్కట్‌పల్లి: మండల పరిధిలోని షాపల్లి గ్రామంలో శనివారం విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందాడు. ఏఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు గ్రామానికి చెందిన ఎడ్ల మహేష్(23) విద్యుత్ కాంట్రాక్టర్ వనం శంకర్ దగ్గర పని చేస్తున్నాడు. పనిలో భాగంగా షాపల్లిలో వీధి దీపాల ఏర్పాటు కోసం విద్యుత్ స్తంభాలకు తీగలు ఏర్పాటు చేస్తుండా విద్యుత్ ఎల్‌సీ సరిగ్గా తీసుకోకపోవడంలో విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై స్తంభం మీదినుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ దవాఖానాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...