సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పది : ఎమ్మెల్యే నోముల


Sun,September 15, 2019 01:45 AM

హాలియా, నమస్తే తెలంగాణ : సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. శనివారం హాలియా పట్టణంలోని నిర్మల ఉన్నత పాఠశాలలో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన అనుముల మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 20 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఎంఈఓ తరి రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి ఎంపీపీ పేర్ల సుమతి పురుషోత్తం, ఎస్‌ఐ వీర రాఘవులు, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు కోడుమూరు వెంకట్రాంరెడ్డి, డీసీ మెంబర్ నులక వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...