లోక్ అదాలత్‌లు


Sun,September 15, 2019 01:44 AM

రామగిరి : కక్షిదారులకు సత్వర, సముచిత న్యాయం అందించడమే జాతీయ లోక్ అదాలత్‌ల లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్‌రెడ్డి, న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.వెంకటేశ్వర్‌రావు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో వారు పాల్గొని మాట్లాడారు. లోక్ అదాలత్‌లో తీర్పు వస్తే తిరిగి అప్పీల్‌కు అవకాశం ఉండదన్నారు. రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల సత్వర పరిష్కారం జరుగుతుందన్నారు. కేసులతో సమయం, డబ్బు వృథా అవుతుందన్నారు. అలా కాకుండా కక్షిదారులు రాజీమార్గాన్ని అవలంభించాలని సూచించారు. కక్షిదారులు లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం 44 సివిల్, మోటార్ వాహనాల నష్టపరిహారం కేసులు 59 పరిష్కరించారు. నష్టపరిహారం కింద రూ.కోటి 50 లక్షలు బాధితులకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అందజేశారు. క్రిమినల్ కేసులు 452, బ్యాంకు రికవరీ కేసులు 95, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యా యవాదులు, కక్షిదారులు, పోలీస్, అధికారులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...