యాదాద్రిలో ప్రత్యేక పూజల కోలాహలం


Fri,September 13, 2019 04:34 AM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం ఆలయాన్ని తెరచిన అర్చకులు స్వామిఅమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణం జరిగాయి. కొండపైన గల పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ఆల య పుష్కరిణీ చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి.

ఘనంగా వ్రతపూజలు
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్దఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ. 34, 500 ఆదాయం సమకూరింది. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

స్వామివారికి బంగారు పుష్పాలు
హైదరాబాద్‌కు చెందిన మంజుల రమేష్ దంపతులు 27 గ్రాముల బంగారు పుష్పాలను శ్రీవారికి సమర్పించారు.

రూ. 6,14, 072 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 6, 14, 072 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 46,944, 100 రూపాయల టిక్కెట్‌తో రూ. 13, 000, కళ్యాణకట్ట ద్వారా రూ. 17, 000, ప్రసాదవిక్రయాలతో రూ. 3, 10, 500, శాశ్వత పూజలతో రూ.10, 116 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...