తగ్గిన కృష్ణమ్మ వేగం


Fri,September 13, 2019 04:34 AM

నందికొండ : ఎగువ కృష్ణ పరీవాహక ప్రాజెక్ట్‌లు అల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలంలోకి ఇన్‌ఫ్లోలు తగ్గడంతో క్రమంగా నాగార్జునసాగర్‌కు వచ్చే వరద ఇన్‌ఫ్లో తగ్గింది. దీంతో క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదలను క్రమంగా తగ్గించారు. బుధవారం 22 క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదలను గురువారం తగ్గిస్తూ ఉదయం 14, మధ్యాహ్నం 8, సాయంత్రం లోపు 4 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో తగ్గడంతో ప్రాజెక్ట్‌ల పూర్తి సామర్థ్యం వరకు నీటి నిల్వ చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలంకు 1,99614 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 86,521 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం సాయంత్రం 4 క్రస్టు గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి 32108 క్యూసెక్కుల నీటి ని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వస్తున్న వరద నీటితో ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ, ఎడమ, కుడి, వరద, ఎస్‌ఎల్‌బీసీ కా ల్వ ద్వారా నీటి విడుదల చేస్తున్నారు.

సాగర్ నీటి సమాచారం
సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులకు ప్రస్తుతం 589.30 అడుగుల వద్ద 309.9534 టీఎంసీల నీరు గురువారం నిల్వ ఉంది. సాగర్ జలాశయం నుంచి క్ర స్ట్ గేట్ల నుంచి 32108 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,048 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 8022 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 10633 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు,డీటీ గేట్స్ (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. రిజర్వాయ ర్ నుంచి మొత్తం 86521 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వా యర్‌లో 884.40 అడుగుల వద్ద 211. 9572 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు ఎగువ నుంచి 1,99,614 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...