ఉగ్ర కృష్ణమ్మ


Thu,September 12, 2019 04:44 AM

-589.80 అడుగుల వద్ద సాగర్ నీటిమట్టం
-నాగార్జునసాగర్ డ్యాం 22 క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల
-రిజర్వాయర్‌కు 3,50,645 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
-శ్రీశైలం రిజర్వాయర్‌కు 3,57,172 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నందికొండ : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సోమవారం నుంచి క్రస్ట్ గేట్ట ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. బుధవారం 22 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 3,50,645 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువ కృష్ణా పరివాహక ప్రాజెక్టులు ఆల్మట్టీ, నారాయణపూర్, జూరాల నుంచి 3,57,172 క్యూసెక్కల నీరు వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ క్రస్ట్ గేట్ల నుంచి 2,99,460 క్యూసెక్కుల నీటిని దిగువనున్న టెయిల్‌పాండ్, పులిచింతల ప్రాజెక్ట్‌లకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు వస్తున్న వరదతో ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ, ఎడమ, కుడి, వరద, ఎస్‌ఎల్‌బీసీ కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

నీటి సమాచారం
నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.80 అడుగుల వద్ద 311.4423 టీఎంసీల నీరు బుధవారం వరకు నిల్వ ఉంది. క్రస్ట్ గేట్ల నుంచి 2,99,460 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి 32,845 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 5,510 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 10,120 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, డీటీ గేట్లు (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10, వరద కాల్వ నుంచి 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 3,50,645 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ 884.70 అడుగుల వద్ద 213.671 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...