సైన్స్ సెమినార్స్ దోహదం


Thu,September 12, 2019 04:41 AM

నల్లగొండ విద్యావిభాగం: విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయతను వెలికితీసేందుకు సైన్స్ సెమినార్స్ ఎంతగానో దోహ దం చేస్తాయని డీఈఓ పి.సరోజనీదేవి తెలిపారు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్ టెక్నాలజీ మ్యూజియం -బెంగుళూర్, తెలంగాణ రాష్ట్రవిద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ ఆదేశాలతో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌ను బుధవారం నల్లగొండలోని డైట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఈఓ హాజరై ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో సైన్స్ ఆలోచనలు, వారికి సైన్స్ పట్ల ఉన్న ఆసక్తి వినూత్న ఆలోచనల ప్రతీరూపమే సైన్స్ సెమినార్స్ అన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 35మంది విద్యార్థులు హాజరై సెమినార్ ఇవ్వగా, ప్రథమ బహుమతి జి.రేవతి 10వతరగతి, కేజీబీవీ-కట్టంగూర్, ద్వితీయ బహుమతి కేవీ సాత్విక 8వ తరగతి-ఎస్‌ఎస్ ఉన్నత పాఠశాల - నల్లగొండ, తృతీయ బహుమతి డి.మాధూరి 10వతరగతి జడ్పీ హైస్కూల్, పడమటిపల్లి-దేవరకొండ ఎంపికయ్యారు. వారికి బహుమతులలతోపాటు జ్ఞాపికలు అందచేశారు. జిల్లా స్థాయిలో ప్రథమ శ్రేణిలో నిలిచ్చిన జి.రేణుక రాష్ట్ర స్థాయిలో ఈనెల 24న జరిగే పోటీల్లో పాల్గొంటుందని నిర్వాహకులు వెల్లడించారు. జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి అధ్యక్షతన జరిగిన ఈ పోటీల్లో న్యాయనిర్ణేతగా ఎన్జీ కళాశాల కెమిస్ట్రీ విభాగం అధ్యాపకుడు పరంగి రవికుమార్, జిల్లాలోని ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...