ప్రతీ కార్యకర్తకు అండ టీఆర్‌ఎస్ జెండా


Thu,September 12, 2019 04:41 AM

చిట్యాల: ప్రతీ కార్యకర్తకు టీఆర్‌ఎస్ అండగా ఉండటంతోపాటు జీవితానంతరం కూడా అతడి కుటుంబ సభ్యులకు భరోసాగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు దాదాపు 100 మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ టీఆర్‌ఎస్ పార్టీలోనే కార్యకర్తలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు.

కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకునే పార్టీ.. ఒకవేళ ఏ కారణం చేతనైనా పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్త మృతిచెందితే రూ.2 లక్షల బీమాను అందజేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటుందని వివరించారు. సీఎం కేసీఆర్ బంగా రు తెలంగాణ కోసం అహర్నిషలు పనిచేస్తూ అమలు చే స్తున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలకు అకర్షితులై అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వెల్లడించారు. పార్టీలో చేరిన వారి లో మల్లెబోయిన మల్లేష్, మ ల్లెబోయిన నర్సింహ, చొప్పరి లింగస్వామి, రుద్రవరం సై దులు, రుద్రవరం లింగస్వా మి, రెముడాల సైదులు, మైల శంకర్, మైల స్వామి, రు ద్రారం రవీందర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, జిల్లా నాయకుడు పాటి నర్సిరెడ్డి, నాయకులు జడల ఆదిమల్లయ్య, గుండెబోయిన సైదులు, ఎద్దులపురి కృష్ణ, మెండె సైదులు, బెల్లి సత్తయ్య, సాగర్ల గోవర్దన్, పాటి మాధవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిట్యాలకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త అమరోజు గోవర్దన్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఎమ్మెల్యే పరామర్శించారు. రూ. 10వేల ఆర్థికసాయం అందజేశారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...