సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఆదర్శం


Tue,August 20, 2019 01:51 AM

కట్టంగూర్ : సాగు, తాగునీరందించేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విశ్వాసంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ముత్యాలమ్మగూడెంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 200మంది నాయకులు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి జడ్పీటీసీ తరాల బలరాములు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంతో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించి మాట్లాడారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీటిని అందించడానికి సీఎం కేసీఆర్ ధృడ సంకల్పంతో పనిచేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి చెంది దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతుబీమా లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్ట్టి, రైతులు, పేదప్రజలను అన్నివిధాలా ఆదుకోవడం జరిగిందన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన దిమ్మపై పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జెల్ల ముత్తి లింగయ్య, జడ్పీటీసీ సభ్యుడు తరాల బలరాములు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడకొండలు, మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, పీఏసీఎస్ డైరెక్టర్ కట్ట జానకిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు మల్లెబోయిన శ్రీను, గాదబోయిన నర్సింహ్మ, గాదబోయిన యాదయ్య, మాజీ సర్పంచ్ పులకరం లింగస్వామి, గద్దపాటి దానయ్య, అమరోజు నర్సింహ్మ, పటేల్ అనంతరెడ్డి, పులకర నారాయణ, గాదబోయిన శంకర్, కట్టెకుంట రవి పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...