కరాటే, జూడో పోటీల్లో వికాష్ విద్యార్థుల ప్రతిభ


Tue,August 20, 2019 01:50 AM

మిర్యాలగూడ అర్బన్ : స్టాండర్డ్ షిటో రియో కరా టే, జూడో అసోసియేషన్ ఆధ్వర్యం లో ఈనెల 18న పట్టణంలోని ఆర్యసమాజ్ మందిరం లో జాతీయ స్థా యిలో నిర్వహించిన ఛాంపియన్‌షిప్ -2019 పోటీలో ఒరిస్సా వికాష్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు కోచ్ నెర్రి కరుణాకర్ తెలిపారు. సోమవారం ఒరిస్సా వికాష్ పాఠశాలలో మెడల్స్ సాధించిన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. ఆరీఫ్, ఆర్యన్ బెహ్ర, మిలాన్ పాటిల్, కుతిష్‌నాయక్, సౌమ్య నంజన్ గిరి, మహేంద్ర ప్రతాప్ సింగ్ ప్రతిభ కనబర్చి బెస్ట్ ప్లేయర్స్ అవార్డు పొందారన్నారు. అదే విధంగా 17 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 13 మందికి వెండి పతకాలు, ఇద్దరికి బ్రౌంజ్ మెడల్స్ వచ్చాయన్నారు. కార్యక్రమంలో కరాటే కోచ్‌లు బాలరాజు, శ్రీధర్, ముత్యాలు, వెంకట్, ఆంజనేయులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...