చెర్వుగట్టును తీర్చిదిద్దుతాం


Tue,August 20, 2019 01:50 AM

నార్కట్‌పల్లి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టును సీఎం కేసీఆర్ సహకారంతో తెలంగాణలో రెండో యాదాద్రిగా తీర్చిదిద్దుతామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రూ.కోటిన్నరతో భక్తుల సౌకర్యార్థం నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్, వసతుల గదులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. చెర్వుగట్టు క్షేత్రం మహిమాన్విత గల క్షేత్రమని, ప్రతీ అమావాస్యనాడు లక్షల కొద్ది భక్తు లు స్వామివారి దర్శనం కొరకు వస్తున్నారని, వారికి మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. యాదాద్రి పనులు వేగవంతం అవుతున్నాయని పూర్తి అయిన తరువాత సీఎం కేసీఆర్‌ను చెర్వుగట్టుకు తీసుకువస్తామన్నారు. త్వరలో రూ.2కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో రెండు వైపులా ఘాట్ రోడ్లను నిర్మిస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా గుట్టపైకి భక్తులకు తాగు నీటి సౌకర్యం కల్పిస్తామన్నారు.

అంతకుముందు ఆలయ ఈఓ సులోచన, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు మేకల రాజిరెడ్డి, పుల్లెంల ముత్తయ్య, సర్పంచ్ బాలకృష్ణ, దూదిమెట్ల సత్తయ్య, బాజ యాదయ్య, బండ జగన్మోహన్ రెడ్డి, మేడి శంకర్, మేకల కరుణాకర్ రెడ్డి, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, రాదారపు విజయలక్ష్మి, రేగట్టె రాజశేఖర్‌రెడ్డి, మేకల వెంకట్‌రెడ్డి, చీర యాదయ్య, మారుపాకల పద్మ, మర్రి నర్సింహ, యామ దయాకర్, నాంపల్లి శ్రీను, కమ్మంపాటి వెంకటయ్య, బండమీది లింగస్వామి, చీర నరేశ్, గౌరీదేవి నర్సింహ పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...