మన ఇంటిలక్ష్మి పై డాక్యుమెంటరీ


Mon,August 19, 2019 02:53 AM

- పాల్గొన్న ఐసీడీఎస్ అధికారులు
- మెగావత్ తండా అంగన్‌వాడీ కేంద్రంలో డాక్యుమెంటరీ చిత్రీకరణ
నేరెడుగొమ్ము (చందంపేట) : బేటీ బచావో- బేటీ పడాఓ, మన ఇంటిలక్ష్మి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డా.గౌరవ్ ఉప్పల్‌కు బెస్ట్ అవార్డు రావడంతో అట్టి కార్యక్రమంపై డాక్యుమెంటరీ బృందం, ఐసీడీఎస్ అధికారులు మెగావత్ తండాలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ సుభద్రతోపాటు ఐసీడీఎస్ అధికారులు హాజరయ్యారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) టీం డాక్యుమెంటరీ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో భోజనం చేస్తున్న చిన్నారులకు డాక్యుమెంటరీలో చిత్రీకరించారు. తండా లో పలువురు గిరిజనులతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. గతంలో ఆడపిల్లల అమ్మకాలు అధికంగా ఉండడంతో ప్రస్తుతం అమ్మకాలను ఎలా అరికట్టారో అనే అంశంపై చిత్రీకరణ చేస్తున్నట్లు పీడీ తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ కిట్టు, కల్యాణలక్ష్మి, బాలికల గురుకుల పాఠశాల, అమ్మఒడి తదితర పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో, ఆడపిల్లలపై ప్రతి గ్రామం లో అవగాహన కల్పించడంలో కలెక్టర్ చురుకైన పాత్ర పోషించడంతో డా.గౌరవ్ ఉప్పల్‌కు ప్రత్యేక చొరవ చూపడంతో మన ఇంటిలక్ష్మి కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందన్నారు. అనంతరం తండాలో పుట్టిన ఆడశిశువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోనే మొట్టమొదటి ఆడ శిశువు విక్రయం ఈ తండాలో జరిగినందున ఇక్కడి నుంచే డాక్యుమెంటరీ చిత్రీకరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీజీజీ టీంలీడర్ ప్రేమ, సీడీపీఓ సువర్ణ, ఏసీడీపీఓ అనురాధ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు రాధ, వెంకటమ్మ, మేరి, రాధిక, సర్పంచ్ లోకసాని తిరిపతయ్య, గణేష్, కిరణ్, విజయ, అజిత ఉన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...