భూమి కబ్జాకు యత్నం


Sun,August 18, 2019 01:39 AM

మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ : విలువైన ఇంటిస్థలం భూమిని కబ్జా చేయానికి ప్రయత్నిస్తున్నారని పట్టణానికి చెందిన నాగనబోయిన నాగమణి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశా రు. బాధితురాలు నాగమణి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నాగార్జుననగర్‌లో 754/ఇ సర్వే నెంబర్‌లో 5గుంటల భూమిని తన త్ంరడ్రి వీరయ్య 1994లో కొనుగోలు చేసి తనపేరు రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. ఈభూమిని ఓ కులసంఘం పేరుతో కొంతమంది వ్యక్తులు ఈభూమికి ఎలాంటి సంబంధం లేకున్నా భూమి మాది అంటూ ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు. చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమి విలువ సుమా రు కోటి రూపాయలకు పైగా ఉంటుందని దీనిని కబ్జా చేస్తామని డబ్బులు ఇవ్వమంటూ 7 గురు వ్యక్తులు బెదిరిస్తున్నారని తెలిపారు. కబ్జాకు పాల్పడుతున్న వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయంపై వన్ టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఏడుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...