నీటి వృథాను తగ్గిద్దాం.. భూగర్భ జలాలు పెంచుదాం


Sun,August 18, 2019 01:39 AM

-లక్ష్మీదేవిగూడెం సర్పంచ్ కృష్ణవేణి
వేములపల్లి: నీటి వృథాను తగ్గించి వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భజలాలను పెంపొందించుకుందామని సర్పంచ్ చెర్కుపల్లి కృష్ణవేణి అన్నారు. శనివారం మండలంలోని లక్ష్మీదేవి గూ డెం గ్రామంలో జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు నీరు చాలా అవసరమని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం మేజిక్ సోక్ ఫిట్, కామన్ సోక్ ఫిట్, పార్కులేషన్ ఫిట్‌లకు మా ర్కింగులు ఇవ్వడంతో పాటు హరితహారంలోభాగంగా మొక్కలు నా టడంతో పాటు హోం స్టడ్ ప్లాంట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మేక లలిత, ఏపీఓ శ్రీన య్య, టీఏ వెంకటరత్నం, ఫీల్డ్‌అసిస్టెంట్లు నాగయ్య, అశోక్, కార్యదర్శులు నాగరాజు, హారిక ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...