అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లోకి..


Sat,August 17, 2019 02:29 AM

మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ: టీడీపీమిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు పాతూరి ప్రసాద్‌రావుతో పాటు 200 మంది కార్యకర్తలు, నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ఆకర్శితులై పలు పార్టీలకు చెందిన వారు టీఆర్‌ఎస్ లో చేరుతున్నారన్నారు. పార్టీలో కొత్త, పాత అనే తేడా లేకుండా కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.

పార్టీలో చేరిన వారంతా త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో కన్నారెడ్డి, ప్రతాప్, అఖిల్, మురళి, వెంకటేశ్వర్లు, రా మయ్య, నర్సరాజు, కోల వెంకన్న, వీరరాఘవులు, నర్సిరెడ్డి, వజ్రగిరి వెంకన్న తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు పెద్ది శ్రీనివాస్‌గౌడ్, సందేషి అంజన్‌రాజు, మాజీద్, శ్రీనివాసరావు, నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...