వాడపల్లి కృష్ణానదికి పెరిగిన వరద


Sat,August 17, 2019 02:28 AM

దామరచర్ల: నాగార్జునాసాగర్ నుంచి దిగువ కృష్ణానదికి 8లక్షల క్యూసెక్కుల నీటిని వదులడంతో మండలంలోని వాడపల్లి వద్ద కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తుంది. శుక్రవారం వరదనీరు అధికం కావడంతో మండలంలోని వాడపల్లి, ఇర్కీగూ డెం, గణేష్‌పాడు గ్రామాలకు చేరింది. వాడపల్లి మీనాక్షీ అగస్తేశ్వర స్వామి ఆలయం సమీపంలోకి నీరు చేరింది. కృష్ణానది తీర గ్రామాలైన గణేష్‌పాడు, ఇర్కీగూడెం గ్రామాల్లోని తీరంలో వేసిన పత్తి పంట సుమారు 50 ఎకరాల వరకు మునిగింది. విద్యుత్‌స్తంబాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగాయి. వాడపల్లి బస్టాండు సమీపంలోని ఇండ్లవరకు నీరు చేరుకుంది. కృష్ణానది వంతెన సమీపంలోని ముగ్గుమిల్లులకు నీరు వచ్చింది. గ్రామాలకు తాగునీటిని అందించే, ఆర్‌డబ్ల్యూఎస్ ట్యాంకులు, మోటార్లు మునిగిపోయాయి. తహసీల్దార్ సంతోష్ కిరణ్ వరద ఉదృతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

జానపాడుకు నిలిచిన రాకపోకలు... సూర్యాపేట జిల్లా జానపాడు దర్గాకు రాకపోకలు నిలిచాయి. మండల కేంద్రం నుంచి సూర్నేపాడుకు వెళ్లే మూసీనది వంతెనకు కృష్ణానది బ్యాక్ వాట ర్ వంతెనపైకి నీరురావడంతో రాకపోకలు నిలిచాయి. వరదనీటి నుంచి ప్రజలు నడకన వంతెనను దాటుతున్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...