భార్యపై భర్త కత్తిపీటతో దాడి


Fri,August 16, 2019 03:35 AM

నూతనకల్ : భార్యపై భర్త కత్తిపీటతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచనపల్లి ఆవాసం గుగులోతు తండాలో గురువారం ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ శివకుమార్ తెలిపిన వివరాలివి.. తండాకు చెందిన గుగులోతు శ్రీను, భద్రమ్మల కూతురు భూక్య మహేశ్వరిని మోతె మండలం బల్లుతండాకు చెందిన భూక్య సుధాకర్‌కు ఇచ్చి 2ఏండ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి 6నెలల పాప ఉంది. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగ్గా ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. బాగా చూసుకుంటానని చెప్పి సుధాకర్ భార్యను కాపురానికి తీసుకొచ్చాడు.

4రోజులు క్రితం బోనాల పండుగకు మహేశ్వరి తల్లి గారింటికి వెళ్లింది. గురువారం సుధాకర్ భార్యని తీసుకెళ్లేందుకు తండాకు వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వ్యవసాయబావి వద్దకు వెళ్లగా అత్తమామాతో కలిసి మహేశ్వరి వ్యవసాయ పనులు చేస్తుండగా మాట్లాడాలని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో భార్యాభర్తల నడుమ వాగ్వాదం జరగడంతో కోపోద్రుక్తుడైన సుధాకర్ ఇంట్లోని కత్తిపీటతో మహేశ్వరి తల, చేతులపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలు కేకలు వేయడం తో చుట్టుపక్కల వారు వచ్చే సరికే భర్త పరారయ్యాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం 108వాహనంలో సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...