జన సాగరం


Thu,August 15, 2019 03:37 AM

- రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య
- ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు
- 583.40 అడుగుల వద్ద నీటిమట్టం, కొనసాగుతున్న 7,84,917క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నందికొండ : కృష్ణమ్మ పరువళ్లను చూడటానికి నాగార్జునసాగర్‌కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. నాగార్జునసాగర్‌లోని డ్యాం, ప్రధాన జలవిద్యుత్ కేంద్ర పరిసరాలు, హిల్‌కాలనీ సత్యనారాయణ స్వామి దేవాలయం నుంచి కొత్త బ్రిడ్జి వరకు బుధవారం రోడ్లు పర్యాటకులతో నిండిపోయినవి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలను దూర ప్రాంతాల్లో నిలపడంతో కాలి నడకన నడచి డ్యాం దృశ్యాలను చూడడానికి పర్యాటకులు బారులు తీరారు. నది తీరంలో క్రస్ట్ గేట్ల వద్ద ఎగిసి పడుతున్న కృష్ణమ్మ వద్ద పర్యాటకులు సెల్ఫీలు దిగి ఆనందంగా గడిపారు.

పర్యాటకులకు సేవలు
నాగార్జునసాగర్‌కు వచ్చిన పర్యాటకులకు కలిపిస్తున్న సేవలను పర్యవేక్షించడానికి జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ డ్యాం పరిసప్రాంతాలను బుధవారం పర్యటించారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలి నడకన వచ్చే పర్యాటకులకు ఇబ్బంది కలుగకుండా పర్యాటకుల కోసం ఉచితంగా రెండు ఆటోలను మిర్యాలగూడ డీఎస్పీ పద్మనాథుల శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. జిల్లా మత్స్య శాఖ అధికారి చరిత శివాలయం, ఆంజనేయ పుష్కర్‌ఘాట్ల వద్ద 20 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ సిబ్బంది వారు నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి పర్యాటకులకు సేవలందిస్తున్నారు. ప్రధాన డ్యాం, పవర్ హౌస్ వద్ద ఎస్‌ఫీఎఫ్ బలగాలు మొహరించాయి.

వీఐపీల సందర్శన
కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి వీఐపీలు కుటుంబ సమేతంగా బుధవారం నాగార్జునసాగర్‌ను సందర్శించారు. శాసన మండలి తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, గ్రెహౌండ్స్ ఐజీ శ్రీనివాస్‌రెడ్డి, ఈఎన్‌సీ (ఇంజనీరింగ్ చీఫ్) మురళీధర్, మహిళ శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ మాలె శరణ్యారెడ్డి తదితరులు సందర్శించారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...