హరిత లక్ష్యాన్ని అధిగమిద్దాం


Thu,August 15, 2019 03:35 AM

సూర్యాపేట టౌన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలనాత్మకంగా చేపట్టి విడుతల వారీగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అన్నిరంగాలు, వర్గాల ప్రజలు, విద్యార్థుల భాగస్వామ్యంతో లక్షలాది మొక్కలు నాటి హరితహార లక్ష్యాన్ని అధిగమించి హరితహారంలోనూ సూర్యాపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. 5వ విడుత హరితహారంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని చెవ్వెంల మండలంలో బుధవారం ఒకేరోజు 1.12లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని బండమీది చందుపట్ల గ్రామంలో ప్రారంభించి.. తిమ్మాపురం మీదుగా మొహిదీంపురం వరకు విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి 1600 మొక్కలు నాటారు. మూడు గ్రామాల్లో సుమారు 4 కిలోమీటర్ల మేర జరిగిన హరితహారం కార్యక్రమంలో కలినడకన ఒక్కొక్కరినీ పలుకరిస్తూ మొక్కలు నాటిన మంత్రి జగదీష్‌రెడ్డికి అడుగడుగునా విద్యార్థులు, నృత్యాలతో, ఆటపాటలతో ఆనందోత్సహాల నడుమ ఘనస్వాగతం పలుకుతూ పండుగ వాతావరణాన్ని తలపించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్‌తరాలు బాగుండాలంటే ఆస్తి, అంతస్తులు కూడబెట్టడమే కాదని, పచ్చదనం పెంపొందించడమే మనం అందించే నిజమైన ఆస్తి అన్నా రు. ముం దుచూపుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నిరంగాల అభివృద్ధిపాటు సంచలనాత్మకంగా చేపట్టిన హరితహారం ఏ ఒక్కరికో పరిమితం కాదని అన్నిరంగాల, వర్గాల ప్రజలు, విద్యార్థులు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా అవి ఏపుగా పెరిగే వరకు సంరక్షించడం బాధ్యతగా చేపట్టాలన్నారు. నాటిన ప్రతి మొక్కకు మంత్రి జగదీష్‌రెడ్డి రాఖీలు కట్టి సోదరభావంతో మొక్కలను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, కలెక్టర్ అమయ్‌కుమార్, జడ్పీ వైస్‌చైర్మన్ వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసగౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీలు ధరావత్ కుమారిబాబునాయక్, నెమ్మాది భిక్షం, తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...