అదుపుతప్పి కారు పల్టీ


Thu,August 15, 2019 03:34 AM

మునగాల : కారు అదుపు తప్పి పల్టీకొట్టిన ఘటన మండలంలోని ఎస్‌ఎంపేట శివారులో సెయింట్ ఆన్స్ పాఠశాల సమీపంలో 65వ నెంబర్ జాతీయరహదారిపై బుధవారం జరిగింది. స్థ్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన శ్రావన్ భార్యాకొడుకుతో కలిసి హైదరాబాద్‌కు బయల్దేరాడు. మండలంలోని ఎస్‌ఎంపేట శివారుకు రాగానే అదుపు తప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లి మిషన్ భగీరథ వాల్వ్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ముగ్గురు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక యువకులు పల్టీకొట్టిన కారును పైకిలేపి వారిని బయటకు తీశారు. కారు వేగంగా ఢీకొనడంతో మిషన్‌భగీరథ పైపులైన్ వాల్వ్ పగిలి నీరు ఫౌంటెయిన్‌ను తలపించేలా పైకి ఎగిసిపడింది. స్థానికుల సమాచారం మేరకు మిషన్ భగీరథ అధికారులు నీటిని నిలుపుదల చేశారు. ప్రమాద విషయం తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...