సాగర్ వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి


Wed,August 14, 2019 02:10 AM

-మున్సిపాలిటీలను క్లీన్‌అండ్ గ్రీన్‌గా రూపొందించాలి
-గ్రామ దర్శినిలో అంగన్‌వాడీలను తనిఖీ చేయాలి
-అధికారుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నీలగిరి : నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి అధికంగా వస్తున్నందున 26 గేట్లు తెరిచి దిగువ ప్రాంతానికి వదులుతున్నందున ఆ ప్రాంతంలో ప్రజల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సాగర్ అవుట్‌ప్లో, ఇన్‌ప్లో, తెలంగాణకు హరితహారం, గ్రామదర్శిని కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్‌లో 26 గేట్లు ఎత్తి నీరు విడుదల చేసినందున ప్రజలు అక్కడికి వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేయాలని సూచించారు. సాగర్ వద్ద కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఇరిగేషన్, వైద్య, మత్స్యశాఖ, అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తు తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలో ఈజీఎస్, నాన్ ఈజీఎస్ కింద మొక్కల పంపిణీ కార్యక్రమం నోడల్ అధికారుల ద్వారా పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీ వలే లక్ష్యం ప్రకారం మొక్కలు నాటి క్లీన్ గ్రీన్ మున్సిపాలిటీలుగా రూపొందించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర పాలక తనిఖీలు చేయాలని ఆదేశించారు. హరితహారంలో నిర్ణయించిన మేరకు లక్ష్యం మేరకు మొక్కలు నాటి అటవీ శాఖ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఈవారం నిర్వహించే గ్రామదర్శినిలో మం డల ప్రత్యేక అధికారులు అంగన్‌వాడీలను తనిఖీ చేసి సమస్యలుంటే తెలియజేయాలన్నారు. పాఠశాలలు, హాస్టల్లు తనిఖీ చేసి మండల స్థాయిలో సమీక్షా స మావేశాలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో జేసీ వి.చంద్రశేఖర్, డీఆర్‌ఓ రవీంద్రనాథ్, అధికారులు రాజ్‌కుమార్, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...