103 గ్రామాలు.. 5.50 లక్షల మొక్కలు


Tue,August 13, 2019 02:16 AM

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : సూర్యాపేట నియోజకవర్గాన్ని హరితవనంలా చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని 103 గ్రామ పంచాయతీల్లో 5.50 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. మంగళవారం సూర్యాపేట మండలం ఇమాంపేట నుంచి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే మండలాల వారీగా హరితహారం టా ర్గెట్‌లు పెట్టిన మంత్రి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు గ్రామ పర్యటనకు శ్రీకారం చుట్టారు.

ఇంటికి ఆరు మొక్కలు...
ప్రతీ గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి జగదీష్‌రెడ్డి నడుంబిగించారు. ఇందుకు గాను మండలాల వారిగా హరితహారం టార్గెట్‌లను పెట్టడం జరిగింది. నియోజక వర్గం పరిధిలోని సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లోని పలు గ్రామాల్లో మంత్రి పర్యనటకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ ఇంట్లో ఆరు మొక్కలు నాటాలే అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

నాలుగు రోజులు నాలుగు మండలాలు...
హరితహారం టార్గెట్‌ను ఒకే రోజు మండల వ్యాప్తం గా నాటే విధంగా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. ఇందుకుగాను మంత్రి జగదీష్‌రెడ్డి నాలుగు రోజుల పాటు నాలుగు మండలాల్లో పర్యటించనున్నారు. ఆయా గ్రామాల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్నివర్గాల ప్రజలు సైతం పాల్గొననున్నారు. ఇప్పటికే మొక్కలను గ్రామాలకు తరలించగా నాటేందుకు గుంటలు సైతం తీయించడం జరిగింది.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...