పేదలకు ప్రభుత్వం ఆసరా


Mon,July 22, 2019 01:46 AM

-ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
-లబ్ధిదారులకు పింఛన్ల ప్రొసీడింగ్స్ అందజేత
నల్లగొండక్రైం: సంక్షేమ పథకాల అమలులో దేశంలో రాష్ట్రం నెంబర్‌వన్ స్థానంలో ఉందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. పెంచిన ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను ఆదివారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ కాలనీ, డైట్ స్కూల్, శాంతినగర్, గంధంవారిగూడెం ప్రాంతాలలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధులకు పింఛన్ రూ.200 ఉండేదని అదికూడా రెండునెలలకోసారి వచ్చేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వృద్ధులకు, వికలాంగులకు, చేతి వృత్తిదారులకు ఎవరి మీద ఆధారపడకూడదని గుర్తించిన సీఎం కేసీఆర్ మొదటిసారిగా పింఛన్ వేయి రూపాయలకు పెంచాడన్నారు. ఇప్పుడు అదే పింఛన్ డబుల్ చేస్తు వృద్ధులకు రూ. 2016, వికలాంగులకు రూ. 3016 పెంచడం జరిగిందని తెలిపారు. జూన్‌నుంచే పెంచిన పింఛనును పంపిణీ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పింఛనుదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఇతర రాష్ర్టాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాన్నారు. దేశంలో పెద్దసంఖ్యలో ఇస్తున్న రాష్ట్రం తెలంగాణే అన్నారు. గతంలో వృద్ధులను కొడుకులు, కోడళ్లు సరిగ్గా చూడటం లేదని, పింఛన్లు వచ్చిన తర్వాత వారిని చూసుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ పెద్దదిక్కు అని అన్నారు. సీఎంను ప్రతి ఒక్క పింఛనుదారుడు ఆశీర్వదించాలన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి పింఛన్లు అందుతాయని తెలిపారు. మధ్యవర్తులు చెప్పిన మాటలు నమ్మవద్దన్నారు. నెలనెలా వారి అకౌంట్లలో పింఛన్లు పడతాయన్నారు. ప్రభుత్వం రైతులు, మహిళలతోపాటు అన్నివర్గాల వారికి లబ్ధిచేకూరేలా సీఎం కేసీఆర్ పథకాలు అమలుచేస్తుందన్నారు. పెరిగిన పింఛన్లను ప్రజలకు తెలియజేయడానికి ఈ ప్రొసీడింగ్స్‌ను అందజేస్తున్నామన్నారు. అర్హత ఉండి పింఛను రాకపోతే మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పింఛను తీసుకున్న ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి సీఎం కేసీఆర్ మాట నిలబెట్టాలన్నారు. ఆ మొక్కలు పెరిగిన తర్వాత వాటిని చూసి మొక్క వేసిన ప్రతి మహిళకు చీర ఇస్తారన్నారు. కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ మాట్లాడుతూ ఆసరా పింఛన్లు పెంచి సీఎం కేసీఆర్ ఎన్నికలో ఇచ్చిన హామీ అమలు చేసారన్నారు. పేద కుటుంబాలకు భరోసా ఇచ్చాడన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్, టీఆర్‌ఎస్ నాయకులు కటికం సత్తయ్యగౌడ్,, అబ్బగోని రమేష్, మందడి సైదిరెడ్డి, కృష్ణారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, సింగం రాంమోహన్, చిలుకల గోవర్ధన్, సమి, మహినోద్దీన్, నిరంజన్‌వలి, మాతంగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...