భక్తిశ్రద్ధలతో ఆషాఢ బోనాలు


Mon,July 22, 2019 01:44 AM

నకిరేకల్, నమస్తే తెలంగాణ : నకిరేకల్ పట్టణంలో కాళికామాత ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల పండుగ ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నకిరేకల్ పట్టణంలోని మహిళలు బోనాలతో కాళికామాత ఆలయంలో బోనాలు సమర్పించారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోనాల పండుగను నిర్వహిస్తారు. కాళికామాత ఆలయంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ప్రతిఒక్కరూ భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఆలయ ప్రహరీ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఆలయ కమిటీసభ్యులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్‌రావు, మాద ధనలక్ష్మి స్థానిక సర్పంచ్ పన్నాల రంగమ్మరాఘవరెడ్డి నాయకులు సకినాల రవి,నడికుడి వెంకన్న, పల్లెబోయిన బద్రి, ప్రగడపు నవీన్‌రావు, యాతాకుల సోమయ్య, రాచకొండ వెంకన్న, యల్లపురెడ్డి సైదిరెడ్డి,దైద పరమేశం, అర్రూరి వెంకటేశ్వర్లు, దొడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...