సాగర్‌లో పర్యాటకుల సందడి


Mon,July 22, 2019 01:43 AM

నందికొండ : ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌కు ఆదివారం విద్యార్థులు, ఉద్యోగులు, వి దేశీ పర్యాటకులు వచ్చారు. బుద్ధుడి జీవిత గాథలకు సంబంధించిన శిల్పాలను, పొందుపరిచిన ఆర్కియాలజీ మ్యూజియంను సందర్శించడానికి లాంచీలో నా గార్జునకొండకు వెళ్లారు. యజ్ఞశాల, ఎత్తైన బుద్ధుడి వి గ్రహం, అశ్వవేదయాగశాల, ఇటుకలతో ఏ ర్పాటు చేసిన స్వస్తిక్ గుర్తు, అలనాటి నదిలోయ నాగరికతలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలు తెలుసుకున్నారు. శ్రీపర్వతారామం (బుద్ధవనం) లోని గోపురం పైన, మ్యూజియంలో అమర్చిన శిల్పాలు, స్తూపపా ర్కు,ధ్యానవ నం, బుద్ధచరితవనం, మహాస్తూపపా ర్కు ప్రాంతాల లో పర్యాటకుల తో సందడి నెలకొంది. టూరిజం శాఖ నాగార్జునకొండకు లాంచీ నడపడంతో రూ.57,720 ఆదాయం వచ్చిందని లాంచీ స్టేషన్ మేనేజర్ గంగరామ్ తెలిపారు. పర్యాటకులతో సాగర్ పర్యాటక ప్రాం తాలైన లాంచీ స్టేషన్, బుద్ధ్దవనం, దయ్యాలగండి, డ్యాం పరిసర ప్రాంతాలు కిటకిట లాడాయి.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...