అన్ని వర్గాలకు సమప్రాధాన్యం కేసీఆర్ ఘనత


Sun,July 21, 2019 01:27 AM


మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి పెంచిన ఆసరా పింఛన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో సంక్షేమ పథకాల కోసం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని కొనియాడారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళల పింఛన్ల కోసం రాష్ట్రంలో రూ. 11500 కోట్లు కేటాయించి అన్ని వర్గాలకు ఆసరా ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. పింఛన్ల పెంపుతో వారిలో భరోసా లభించిందని అన్నారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ ఆసరా పింఛన్లు పంచడం వల్ల వృద్దులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేఎంవీ జగన్నాథరావు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, నాయకులు అన్నభీమోజు నాగార్జునచారి, మగ్దూంపాష, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, వింజం శ్రీదర్, కూనల గోపాలకృష్ణ, పూనాటి లక్ష్మీనారాయణ, రమనయ్య తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...