పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి


Sat,July 20, 2019 06:12 AM

నల్లగొండరూరల్ : పెండింగ్ భూ సమస్యలను గ్రామాల్లో నిర్వహించే గ్రామసభల ద్వారా సత్వరమే పరిష్కారమయ్యేలా చూడాలని జేసీ చంద్రశేఖర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని రసూల్‌పురం, జీకే అన్నారంలో నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న క్లియర్ ఖాతాలను త్వరగా పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను రైతులు గ్రామసభ దృష్టికి తీసుకురావాలని కోరారు. భూ సమస్యలు పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు గ్రామాల్లోనే గ్రామసభలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధరణి ఆన్‌లైన్‌లో సవరణలు, డిజిటల్ సంతకంపై అధికారులు అవగాహన కలిగి ఉండాలని, ఆపరేటర్లపై బాధ్యత ఉంచకుండా తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు. అనంతరం రసూల్‌పురం, జీకే అన్నారంలో రైతులు ఆయా గ్రామాల చెరువులను సర్వే చేయించాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా మండలంలోని అమ్మగూడెం, చందనపల్లిలో భూరికార్డుల నవీకరణ గ్రామ సభలు జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ దామోదర్‌రావు, ఇన్‌చార్జి ఆర్‌ఐ కుమార్‌రెడ్డి, ఏఆర్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి, వీఆర్వోలు నీలిమ, సాలేహ తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...