భూ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు


Sat,July 20, 2019 06:11 AM

నాంపల్లి : రైతుల భూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వాసుచంద్ర హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయా న్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడు తూ భూ రికార్డుల ప్రక్షాళనలో భా గంగా గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సభ ల్లో రైతుల భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామసభల్లో సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన పలువురు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ నాగిరెడ్డి అరుణజ్యోతి, డిప్యూటీ తహసీల్దార్ ఎండీ. ముక్తార్, ఆర్‌ఐ క్రాంతికుమార్ తదితరులున్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...