దీన్‌దయాల్ స్పర్శ యోజన ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం


Sat,July 20, 2019 06:11 AM

రామగిరి : పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో దీన్‌దయాల్ స్పర్శ యోజన ఉపకార వేతనాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు నల్లగొండ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పిలటెలి క్విజ్, ప్రాజెక్టులు డివిజన్, రీజినల్, సర్కిల్ వారిగా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తులను ఆగస్టు 23లోగా నల్లగొండ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. పూర్తి వివరాలకు ww w.indiapost.gov.inను సంప్రదించాలని పేర్కొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...