నాగార్జున ప్రభుత్వ కళాశాల సెమిస్టర్ ఫలితాలు విడుదల


Thu,July 18, 2019 04:28 AM

రామగిరి: నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్) ఈ సంవత్సరం ఏప్రిల్/మేలో నిర్వహించిన డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం 4వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఎంజీయు సీవోఈ డా. మిర్యాల రమేష్‌కుమార్, అసిస్టెంట్ సీవోఈ అరుణప్రియలు హాజరై విడుదల చేశారు. ఫలితాలను ఆ కళాశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ఎన్జీ కళాశాల సీవోఈ పరంగి రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ కె. చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్, అకాడమిక్ కోఆర్డినేటర్ సయ్యద్ మునీర్, అసిస్టెంట్ సీవోఈ ఎన్. లవేందర్, వి. నందకుమార్, పరీక్షల విభాగం టెక్నీషియన్, సిబ్బంది ఎం.డి. నజీర్, నర్సింహా, సైదులు, ఆంజనేయులు, మురళితో పాటు వివిధ విబాగాల అదిపతులు పాల్గొన్నారు.

ఫలితాలు ఇలా...
డిగ్రీ 4వ సెమిస్టర్‌కు బీఎలో 218 హాజరు కాగా 105మంది ఉత్తీర్ణత సాధించారు. 113 మంది ఫెయిల్ కాగా 48శాతం ఫలితాలు వచ్చాయి.
అదేవిధంగా బీకాంలో 131మంది హాజరు కాగా 58మంది ఉత్తీర్ణత, 73మంది ఫెయిల్‌కాగా 44శాతం ఫలితాలు వచ్చాయి.
బీఎస్‌సీలో 469 మంది హాజరు కాగా 245 మంది ఉత్తీర్ణత సాధించారు. 224 మంది ఫెయిల్‌కాగా 52 శాతం ఫలితాలు వచ్చాయి.
డిగ్రీ 6వ సెమిస్టర్‌కు బీఏలో 190హాజరు కాగా 135మంది ఉత్తీర్ణత సాధించారు. 55 మంది ఫెయిల్‌కాగా 71శాతం ఫలితాలు వచ్చాయి.
అదేవిధంగా బీకాంలో 119మంది హాజరు కాగా 97మంది ఉత్తీర్ణత, 22మంది ఫెయిల్‌కాగా 82శాతం ఫలితాలు వచ్చాయి.
బీఎస్‌సీలో 455 మంది హాజరు కాగా 336 మంది ఉత్తీర్ణత సాధించారు. 119మంది ఫెయిల్‌కాగా 74 శాతం ఫలితాలు వచ్చాయి.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...