ఒక్కక్షణం ఆలోచించండి.!


Thu,July 18, 2019 04:28 AM

కట్టంగూర్ : ఆధునిక యుగంలో రోజురోజుకు మని షి జీవన విధానంలో మార్పులు వస్తున్నాయి. అందు కు అనుగుణంగా వివిధ రకాల విలాసవంతమైన వా హనాల వినియోగం పెరిగింది. ఆధునిక భద్రతా సౌకర్యాలతో వాహనాలు అందుబాటులోకి వచ్చినా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి. రెప్పపాటు ప్రమాదా ల్లో కుటుంబ పెద్దలు, కన్నబిడ్డలను కోల్పోయి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. డ్రైవింగ్‌లో జాగత్రలతో ప్రమాదాల నివారణ సాధ్యమే.

అతివేగం ప్రమాదం..
అతివేగంతోనే ఎక్కువ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. త్వరగా వెళ్లాలనే అతృతలో వేగంగా నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. వేగంగా వెళ్తూ ఆకస్మాత్తుగా బ్రేకులు వేసి ప్రమాదాల బారినపడుతున్న ఘటనలు నిత్య కృత్యమవుతున్నాయి. వేగంగా కన్నా ప్రాణం మిన్న నినాదంతో వాహనాలు నడిపితే ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

మద్యం మత్తులో నడిపితే ముప్పు..
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం మత్తులో వాహనాలు నడపడమే. మత్తులో వాహ నం నడిపితే ఆలోచన, సమన్వయం దెబ్బతిని ప్ర మాదాలు జరిగే ఆస్కారాలు ఎక్కువ. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు పోలీసులు బ్రీత్‌ఎన్‌లైజర్‌తో పరీక్షిస్తూ కేసులు నమోదు చేస్తున్నా వాహనదారుల్లో మార్పు రాకపోవడం లేదు. తనిఖీల్లో పట్టుబడితే జరిమానా తో తప్పించుకోవచ్చు అనే ధోరణిలో వ్యవహరించి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.

సెల్‌ఫోన్ డ్రైవింగ్ యమ డేంజర్..
వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడటం పరిపాటిగా మారుతోంది. వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడడం సరికాదు. మాటల్లో పడి వా హనంపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జ రుగే అవకాశముంది. ఎదుటి వారి ప్రాణాలకూ ఇది ముపే్పు. ఫోన్ వస్తే రోడ్డు వెంట వా హనాన్ని నిలిపి మాట్లాడం శ్రేయస్కరం. 10ఏళ్లు నిండని వారు సైతం వాహనాలు నడుపుతున్నారు. పిల్లలకు వాహనాలు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

హెల్మెట్ శ్రీరామరక్ష..
ద్విచక్ర వాహనం నడిపే వారు విధిగా హెల్మె ట్ ధరించాలి. బైక్ ప్రమాదాల్లో ఎక్కవ శాతం మంది తలకు బలమై గాయాలై చనిపోతున్నారు. హెల్మెట్ ధరించడంతో వెనక కూర్చున్న వారు డ్రైవింగ్ చేసే వారితో మాట్లాడే అవకావం ఉండదు. సెల్‌ఫోన్‌లో సైతం మాట్లాడలేం. హెల్మెట్ ధరిస్తే డ్రైవింగ్‌పై ఏకాగ్రత పెరుగుతుంది. అలసట అనిపించదు.

పరిమితికి మించి ప్రయాణం అపాయం..
వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం ప్రమాదకరం. వాహనాల్లో శుభకార్యాలకు, విహారయాత్రలకు వెళ్లేటప్పుడు పరిమితికి ప్రయాణించడం ప్రమాదాలకు దారితీస్తున్నాయి. డ్రైవర్ పక్కన ఇద్దరు నుంచి ముగ్గురు కూర్చోవడం వల్ల వాహనం నడిపే వ్యక్తి స్టీరింగ్ తిప్పడం కష్టమై వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ద్విచక్ర వాహనంపై ఇద్దరికంటే ఎక్కువ మంది వెళ్లడం మంచిది కాదు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానం చేరాలంటే బస్సు ప్రయాణమే శ్రేయస్కరం.

బీమా తప్పనిసరి..
వాహనం నడిపే వారికి బీమా తప్పనిసరి. పూర్తి , థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకోచ్చు. ఫుల్ ఇన్సూరెన్స్ చేయడంతో వాహనం దెబ్బతిన్నా.. నడిపే వారికి గా యాలైనా, మృతి చెందినా పరిహారం లభిస్తుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వాహనం కారణంగా ఎదుటి వారికి ప్రమాదం జరిగితే పరిహారం లభిస్తుంది. లేకుంటే కోర్టు చుట్టూ తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...