తప్పిపోయిన మహిళ మృతి


Wed,July 17, 2019 05:46 AM

మల్దకల్ : మల్దకల్ మండలంలోని ఎల్కూర్ గ్రామానికి చెందిన బోయ సరోజ, ఆమె కుమారుడు సంతోష్‌కుమార్‌లు గత సంవత్సరం 24-09-2018న తప్పిపోయినట్లు మల్దకల్ పోలీస్ స్టేషన్‌లో సరోజ తండ్రి బుడ్డన్న 3-10-2018న ఫిర్యాదు చేశాడని ఎస్‌ఐ క్రిష్ణాబుల్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు మిస్సింగ్ కేసుగా కేసును నమోదు చేసుకొని వివిధ కోణాలలో విచారణ చేశామన్నారు. గ్రామానికి చెందిన కొందరిని విచారణ చేస్తున్న క్రమంలో సరోజ భర్త సంజన్నను కూడా విచారణ చేయగా తుంగభద్ర నదిలో తానే గొంతు నులిమి చంపేసినట్లు అంగీకరించాడన్నారు. ఎల్కూర్ గ్రామానికి చెందిన బోయ గౌడ గారి సంజన్న ఇది వరకే పెళ్లి చేసుకున్నాడన్నారు. అయితే మళ్లీ అదే గ్రామానికి చెందిన సరోజతో సంబంధం నెరుపుతుండేవాడన్నారు. అయితే అందరికి తెలియడంతో సరోజను కూడా రెండో పెళ్లి చేసుకున్నాడన్నారు. వీరికి కుమారుడు సంతోశ్‌కుమార్ పుట్టగా సరోజ తన తల్లిదండ్రులతో ఉండేదన్నారు. తల్లిదండ్రులు తనని ఎంతవరకు సాదుతారని భర్త సంజన్నతో అతడి ఆస్తిలో కొంతమేర తన పేరుపై ఉంచాలని వాదులాడేదన్నారు. దీంతో సంజన్న సరోజకు ఆస్తి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోనని భావించి మంత్రాలయం వెళ్దామని తీసుకెళ్లాడన్నారు. 24-9-18న మంత్రాలయం తీసుకెళ్లి 25.9.18న భార్య సరోజ, బిడ్డ సంతోష్‌ను గొంతు నులిమి చంపి తుంగభద్ర నదిలో పడేశారని తెలిపారు. మంగళవారం సీఐ జక్కుల హనుమంతు ఆధ్వర్యంలో మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా నమోదు చేసి సంజన్నను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్డు అతడికి రిమాండ్ విధించిందని తెలిపారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...