టీఆర్‌ఎస్ పథకాలు దేశానికే ఆదర్శం


Tue,July 16, 2019 05:09 AM

కొండమల్లేపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లతో కలిసి టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రాంబాబు నాయక్‌కు టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని అందించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు టీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, దేశంలో సంక్షేమ ఫలాలు ప్రజలకు సంవృద్ధిగా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. రైతులకు నాణ్యమైన 24గంటల కరెంటు, రైతుబీమా, రైతుబంధు, మిషన్ భగీరథతోపాటు కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమయిందన్నారు. టీఆర్‌ఎస్‌ను బూత్ స్థాయి నుండి గ్రామస్థాయి వరకు బలోపేతంచేసే దిశగా కార్యకర్తలు కృషిచేయాలని పార్టీ సభ్యత్వ నమోదులో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతిఒక్కరికి రూ.రెండు లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని ప్రతిఒక్కరు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్యా దేవేందర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంతు వెంకటేష్‌గౌడ్, టీవీఎన్ రెడ్డి, రాజీనేని వెంకటేశ్వరరావు, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులున్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...