దివ్యాంగులకు మరో కానుక


Mon,July 15, 2019 02:26 AM

-కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ సాయం 25శాతం పెంపు
-ఇక నుంచి రూ.1,25,145 అందించనున్న ప్రభుత్వం
-రెండో వివాహానికీ వర్తింపు
-హర్షం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు
దృఢ సంకల్పానికి, ఆత్మవిశ్వాసం తోడైతే జీవితంలో ఎదగడానికి అంగవైకల్యం ఏమాత్రం అడ్డుకాదని నిరూపిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా తెలంగాణ సర్కారు అడుగులు వేస్తోంది. దివ్యాంగులను సకలాంగులకు దీటుగా తీసుకుపోయేందుకు కృషి చేస్తున్నది. పేదింటి అడపిల్లకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా లక్షా 116 రూపాయలు ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్నది. ప్రస్తుతం మరో 25 శాతానికి పెంచారు. దీంతో కేసీఆర్‌ పాలనపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలు, కాంట్రాక్టు, రెండు పడకల ఇళ్లు కేటాయింపు పథకాల్లో దివ్యాంగులకు 5 శాతం అదనంగా రిజర్వేషన్‌ ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం పెళ్లి కానుకను సైతం పెంచారు. కులమతాలు తేడా లేకుండా ఇప్పటికే వస్తున్న సాయం అదనంగా 25 శాతం పెంచుతు నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దివ్యాంగ పెళ్లి కూతురి తల్లి బ్యాంకు ఖాతాలో రూ.1,25,145 పడనుంది. ఈ విషయమై దివ్యాంగులు, నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులుగా గుర్తించబడాలంటే పూర్తి అంధత్వం అతి తక్కువ చూపు కల్గిఉండడం, వినికిడి లేదా మాట్లాడడంలో లోపం, శారీరక(చలన)లోపం, బుద్ది మాంధ్యత(మానసిక వికలాంగులు), మానసిక రోగం, కుష్టువ్యాది నయమైన వారు కూడా అర్హులవుతారు. జిల్లాలో వికలాంగులకు చేయూత నివ్వడం కోసం 1987లో వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్రత్యేక విభాగంగా ఈ కార్యాలయం పనిచేస్తుంది. వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా పూర్తి అంధత్వం, తక్కువ చూపుకలిగి ఉన్న వారికి, కుష్టివ్యాధికి గురైన వారికి, మాట్లాడలేని, వినికిడి లోపం ఉన్నవారి, బుద్దిమాంధ్యం, మానసిక రోగం, మరుగుజ్జులకు, ఫ్లోరిసిస్‌ బాధితులకు ప్రభుత్వం అమలు చేసే ఆర్థిక సాయం అందిస్తున్నారు.
దివ్యాంగులకు పింఛన్లు...
దివ్యాంగులకు ప్రభుత్వం డీఆర్‌డీఏ ద్వారా పింఛన్లను అందిస్తున్నది. గతంలో రూ.200 పింఛన్లు ఇవ్వగా తెలంగాణ ప్రభ్వుతంలో సీఎం కేసీఆర్‌ రూ.1500లకు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 28,709 మంది ప్రతినెల పింఛన్లు పొందుతున్నారు. సూర్యాపేట జిల్లాలో 20,029, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1566 మందితో కలిపి ఉమ్మడి జిల్లాలో 50,304 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారు.

ప్రతి దివ్యాంగుడికి చేయూత
జిల్లాలో ఉన్న ప్రతి దివ్యాంగుడికి చేయూతనిచ్చేందుకు వికలాంగుల సంక్షేమ శాఖ కృషి చేస్తుంది. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను జిల్లా యంత్రాంగం సహకారంతో అమలు చేస్తున్నాం. జిల్లాల పునర్విభజనలో భాగంగా వికలాంగుల శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనమైంది. దివ్యాంగులను సకాలాంగులు వివాహం చేసుకుంటే ప్రోత్సహంతో పాటు వివిధ పధకాలు మంజూరు చేయడం జరగుతుంది. వారికి ఇప్పుడు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1,25,145కు పెంచుతూ ఉత్తర్వులు వచ్చాయి.
- మాలే శరణ్యరెడ్డి. రీజినల్‌ అర్గనైజర్‌, ఐసీడీస్‌

సాయం పెంపు మరిచిపోలేనిది
దివ్యాంగులకు పెళ్లి సాయం 25 శాతం పెంచడం మరిచిపోలేనిది. జిల్లాలో ఎంతో మంది దివ్యాంగుల కుటుంబాలు ఆ్థకంగా ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకంతో ఉపాధి పొందవచ్చని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. మాలాంటి పేద వికలాంగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
- జక్కల నగేష్‌, అప్పాజీపేట, నల్లగొండ

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
దివ్యాంగ వధువుల పెళ్లికి ఆర్థిక సాయం పెంచుతూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఇప్పటికే దివ్యాంగులకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి అందిస్తున్న ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు సాయం పెంచడం మాములు విషయం కాదు. కార్యాలయాల్లో దరఖాస్తుల పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. సాయం త్వరగా అందేలా చూడాలి.
- వెంకటయ్య, నల్లగొండ

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...