కరువును పారద్రోలుదాం


Mon,July 15, 2019 02:26 AM

-సెంట్రల్‌ వాటర్‌కమిషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌, జలశక్తి అభియాన్‌ టెక్నికల్‌ అధికారి రణధీర్‌కుమార్‌ చౌదరి
వేములపల్లి : వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించుకొని కరువును పారద్రోలుదామని సెంట్రల్‌ వాటర్‌కమిషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌, జలశక్తి అభియాన్‌ టెక్నికల్‌ అధికారి రణధీర్‌కుమార్‌ చౌదరి అన్నారు. ఆదివారం మండలంలోని మొల్కపట్నం గ్రామంలో జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డితో కలిసి రైతు యాదగిరి వ్యవసాయ క్షేత్రంలోని డ్రాగన్‌ ప్రూట్‌ పండ్ల తోటను పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నీటి కొరత ఎదుర్కొంటున్న 254 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి ముందుకు తీసుకుపోవడం జరుగుతుందన్నారు.జిల్లాలోని వేములపల్లి, కట్టంగూర్‌, కనగల్‌, పెద్దవుర, నాంపల్లి మండలాలను జలశక్తి అభియాన్‌ కింద గుర్తించడం జరిగిందన్నారు. వర్షపు నీరు ఇంకే విధంగా రైతులు తమ పంట పొలాల్లో సేద్యపు కుంటలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శోభారాణి, ఎంపీపీ పుట్టల సునిత, వైస్‌ ఎంపీపీ పాదూరి గోవర్దనిశశిధర్‌రెడ్డి, ఎంపీటీసీ పల్లా వీరయ్య, ఉపసర్పంచ్‌ పల్లావీరయ్య, ఏపీడీ శైలజ, ఏడీఏ నాగమణి, ఆర్‌డబ్య్లూఎస్‌ ఏఈ సంపత్‌కుమార్‌, ఏఓ రుషేంద్రమణి, ఎంఈఓ వీరయ్య, ఏపీఓ శీనయ్య, ఏపీఎం అనుక్‌, ఏఈఓ సంతోష్‌, కార్యదర్శి స్వరాజ్యం, వీఆర్వోలు లచ్చయ్య, కాశయ్య, మస్తాన్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

కనగల్‌ : వర్షపు నీటిని పొదుపు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కేంద్ర పట్టుపరిశ్రమ శాఖ సంయుక్త కార్యదర్శి, జలశక్తి అభియాన్‌ అధికారి నిహ ర్‌ రంజాన్‌దాస్‌ అన్నారు. జలశక్తి అభియాన్‌ పథకం లో భాగంగా మండలంలోని చర్లగౌరారం, రేగట్టే గ్రా మాల్లో ఏర్పాటు చేసిన చెక్‌డ్యాంలు, ఇంకుడుగుంత లు, పాంపడ్స్‌ను పరిశీలించారు. భూగర్భజలాలు అడుగుంటుతున్న క్రమంలో వర్షాపు నీటిని పొదుపు చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషిచేయాలన్నారు. పలు అంశాలను డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకన్న, ఎంపీడీఓ అల్తాఫ్‌ ఆహ్మద్‌, ఏఓ అమరేందర్‌గౌడ్‌, ఏపీఓ సుధాకర్‌, ఏపీఎం బత్తుల నరహరి, ఏడీఈ నాగమణి, సర్పంచ్‌లు చింతల యాదగిరి, హేమనాయక్‌, ఏఈఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...