నీతి, నిజాయితీకి మారుపేరు ఏకలవ్యుడు


Mon,July 15, 2019 02:25 AM

-మహానేతలను ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలి
-జడ్పీచైర్మన్‌ బండా, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి
-పరడలో ఏకలవ్యుడి విగ్రహం అవిష్కరణ
కట్టంగూర్‌ : నీతి, నిజాయితికీ మారుపేరు ఏకలవ్యుడని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండలంలోని పరడ గ్రామంలో తెలంగాణ ప్రదేశ్‌ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకలవ్యుడి విగ్రహాన్ని వారు ఆవిష్కరించి మాట్లాడారు. సంకల్పం, పట్టుదలతో విలువిద్యలో మేటిగా నిలిచిన కొప్ప వ్యక్తి ఏకలవ్యుడని కొనియాడారు. రాష్ట్రంలోనే మొదటి విగ్రహాన్ని నకిరేకల్‌ నియోజకవర్గంలోని పరడ గ్రామంలో అవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. విలువిద్యను అభ్యసించాలనే కోరిక ఉన్నా ద్రోణాచార్యుడు తిరస్కరించడంతో మట్టి విగ్రహాన్ని దగ్గర పెట్టుకొని నిగ్రహశక్తితో విలువిద్యలు చేర్చుకున్న గొప్ప వ్యక్తి ఏకలవ్యుడన్నారు. ప్రతి ఒక్కరూ ఏకలవ్యుడు, అంబేద్కర్‌, జ్యోతిరావుపూలే లాంటి మహా నాయకులను ఆదర్శంగా తీసుకొని నమ్ముకున్న సిద్దాంతాల మేర జాతి అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. ఎరుకుల కులస్తుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. పరడలో ఎరుకుల కులస్తులకు కమ్యూనిటీ నిర్మాణం కోసం ఎమ్మెల్యే సొంత నిధులు రూ. 5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్‌ ఎరుకుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కుతాడి రాములు, రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, జిల్లా అధ్యక్షుడు కోనేటి నర్సింహ, న్యాయవాది గోలి అమరేందర్‌రెడ్డి, ఎంపీపీ జెల్ల ముత్తి లింగయ్య, జడ్పీటీసీ తరాల బలరాములు, సర్పంచ్‌, ఎంపీటీసీలు పుట్ట సుజన, పురుషోత్తంరెడ్డి, వైస్‌ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, శంకర్‌, కూరాకుల రవికుమార్‌, రుద్రాక్షి వెంకన్న, తమ్మయ్య, కోనేటి యాదగిరి, కోనేటి తమ్మయ్య, కోనేటి ఎల్లయ్య, కోనేటి శేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, సీనియర్‌ నాయకుడు గద్దపాటి దానయ్య, తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...