టీఆర్‌ఎస్‌తోనే నందికొండ అభివృద్ధి


Sun,July 14, 2019 01:27 AM

నందికొండ : కాంగ్రెస్ నాయకులు నాగార్జునసాగర్ అభివృద్ధికి ఏలాంటి కృషి చేయలేదని, టీఆర్‌ఎస్ పార్టీతోనే నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోములు నర్సింహయ్య అన్నారు. మున్సిపాలిటీలో నూతనంగా విభజించిన 12 వార్డుల్లో శనివారం ఆయన పర్యటించారు. కార్యకర్తలతో కలిసి వార్డుల్లో తిరిగి కంప చెట్లు, డ్రైనేజీలను పరిశీలించి, స్థానిక ప్రజలను సమస్యలడిగి తెలుసుకున్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడి ప్రజలను గత ప్రభుత్వాలు కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారన్నారు. నందికొండ వద్ద నిర్మించాల్సిన డ్యాంను దిగువన నిర్మించడం వల్ల ఆంధ్రాకు లాభం, తెలంగాణకు నష్టం జరిగిందన్నారు. 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నాగార్జునసాగర్‌ను నందికొండ పేరుతో మున్సిపాలిటీగా చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే టీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. నందికొండలోని 12 కౌన్సిలర్ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపునకు ప్రతీ కార్యకర్త సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

సభ్యత్వ నమోదులో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని, వేర్వేరు పార్టీల నుంచి నాయకులు స్వచ్ఛందంగా వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు సత్యనారాయణ స్వామి ఆలయంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ ఇన్‌చార్జి కమిషనర్ రఫీకున్నీసాబేగం, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, నందికొండ మున్సిపాలిటీ ఇన్‌చార్జి కర్న బ్రహ్మానందరెడ్డి, ఇర్ల రామకృష్ణ, బత్తుల సత్యనారాయణ, పైలాన్ పట్టణాధ్యక్షుడు సల్లోజు శేఖరాచారి, కార్యదర్శులు ముడావత్ లక్ష్మణ్‌నాయక్, చంద్రమౌళి, సత్యనారాయణరెడ్డి, ఎం రామ్మోహన్‌కుమార్, రాజ్‌గోపాల్‌రెడ్డి, శరత్‌రెడ్డి, లింగాల పెద్దులు, రమేష్‌జీ, గుజ్జుల కొండలు, కారంపుడి విష్ణుమూర్తి, ఇర్ల శ్రీను, గౌస్, మసీదురాము, మంద శాంతకుమారి, కోట్ల సైదులు, విక్రమ్, వీరయ్య, శివనాగులు, మధు, విజయ్, అమ్మోరయ్య, పైలాన్, హిల్‌కాలనీ టీఆర్‌ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...