క్రమశిక్షణకు మారుపేరు టీఆర్‌ఎస్


Sun,July 14, 2019 01:27 AM

కేతేపల్లి: క్రమశిక్షణకు మారుపేరు టీఆర్‌ఎస్ పార్టీ అని, కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని చీకటిగూడెం గ్రామ శివారులో గల ఆరెంజ్ హోటల్‌లో శనివారం సాయంత్రం పార్టీ సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. పలువురు కార్యకర్తలకు పార్టీ సభ్యత్వాలు అందించి మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి లాంటి పథకాలతో దేశంలోనే ఆదర్శవంతమైన సీఎంగా కేసీఆర్ నిలిచారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తూ పేదలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కార్యకర్తల అండతోనే టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోందని పేర్కొన్నారు.

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి : ఎమ్మెల్యే చిరుమర్తి
పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. కొత్త, పాత తేడా లేకుండా పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఏదేని కారణంచేత పార్టీ కార్యకర్త మృతి చెందితే రూ.2 లక్షలు అందించి వారి కుటుంబానికి అండగా నిలిచేపార్టీ టీఆర్‌ఎస్ ఒక్కటే అన్నారు.

సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి : రవీందర్‌రావు
అన్ని గ్రామాల్లోనూ పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని పార్టీ సభ్యత్వ నియోజకవర్గ ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. గతంలో ఉన్న సభ్యత్వాలను కొనసాగిస్తూ ఆసక్తి ఉన్న కొత్త వారికి కూడా అందజేయాలన్నారు. ఈ నెల 15 లోపు సభ్యత్వాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బడుగుల శ్రీనివాస్‌యాదవ్, చల్ల కృష్ణారెడ్డి, బంటు మహేందర్, మారం వెంకట్‌రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు కోట వెంకటేశ్వరరావు, బచ్చు జానకిరాములు, కట్ట శ్రవణ్, ఎంపీటీసీలు, పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...