వైభవంగా తొలి ఏకాదశి


Sat,July 13, 2019 01:55 AM

- చెర్వుగట్టులో ప్రత్యేక పూజలు
- పాల్గొన్న జడ్పీచైర్మన్ బండా, ఎమ్మెల్యే చిరుమర్తి
నార్కట్‌పల్లి : మండలంలో శుక్రవారం తొలి ఏకాదశి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి దంపతులు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దర్శించుకున్నారు. ఆలయ ఆచారం ప్రకారం ఆలయ ఈఓ సులోచన, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రేగెట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ వారికి పూర్ణకంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండా, చిరుమర్తి మాట్లాడుతూ యాదాద్రి అభివృద్ది పనుల అనంతరం చెర్వుగట్టు ఆలయాన్ని మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, సర్పంచ్ మల్గ బాలకృష్ణ, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సట్టు సత్తయ్య, రాదారపు విజయలక్ష్మి, కొండూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...