నల్లగొండ మున్సిపల్ పీఠం గులాబీ జెండాదే


Sat,July 13, 2019 01:55 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నల్లగొండ మున్సిపాలిటీ పీఠం గులాబీ జెండాదే అని కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘానికి చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో అత్యధిక వార్డులు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులే గెలచుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిదేళ్లలో చేపట్టిన అభివృద్ది మూలంగానే చేరికలు జరుగుతున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో టీడీపీ జిల్లా కార్యదర్శి, పద్మశాలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిప్రోలు రమేష్‌నేత, పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడుకు లక్ష్మీనారాయణ, ఎస్‌పీటీ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గంజి నాగరాజు, పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి వంగరి రవీంద్ర, పట్టణ ఉపాధ్యక్షులు పున్న వీరేష్, రుద్ర లక్ష్మీనారాయణ, కర్నాటి యాదగిరి, గుర్రం వెంకన్న, శ్రీనివాస్ తదితరులు మాజీ కౌన్సిలర్ యాదగిరి సమక్షంలో చేరారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...