నేడు టీఆర్‌టీ కౌన్సెలింగ్


Sat,July 13, 2019 01:54 AM

రామగిరి : ఉపాధ్యాయ నియామకానికై టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన టీఆర్‌టీ-2017కు ఎంపికైన అభ్యర్థులకు శనివారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 341 మంది అభ్యర్థులు అర్హత సాధించగా గురువారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 330 మంది హాజరయ్యారు. వీరందరికి రోస్టర్ కం మెరిట్ ప్రతిపాదికన పాఠశాలల ఎంపికకై కౌన్సెలింగ్ జరుగనుంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే కౌన్సెలింగ్‌కు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ సరోజినిదేవి తెలిపారు.

కౌన్సెలింగ్ ఇలా...
డైట్‌లో శనివారం నిర్వహించే టీఆర్‌టీ నియామకాల కౌన్సెలింగ్ ఇలా సాగనుంది. టీఆర్‌టీ నియామకాల కమిటీ చైర్మన్ కలెక్టర్ అధ్యక్షతన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం స్కూల్ అసిస్టెంట్ అన్ని విభాగాలకు ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం భాషా పండితులు-తెలుగుకు ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించనున్నారు. కౌన్సిలింగ్ పూర్తియ్యాక నియామక పత్రాలను అందజేస్తారు. ఈ నెల 15న ఆయా పాఠశాలల్లో వీరంతా విధుల్లో చేరాల్సి ఉంటుంది.

కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు...
కౌన్సెలింగ్‌కు వచ్చే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జీరాక్స్, 3 ఇటీవల దిగిన పాస్‌ఫొటోలు తీసుకుని రావల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా కేటగిరిల్లో ఖాళీలను నల్లగొండ జిల్లా డీఈఓ కార్యాలయ నోటీసు బోర్డుతో పాటు www.deonalgonda.blogspot.com వెబ్‌సైట్‌లో పొందు పరిచారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...