మిషన్‌భగీరథ వేగవంతం చేయాలి


Thu,July 11, 2019 03:53 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి వచ్చే నెల నుంచి ఇంటింటికి తాగునీరందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని తన చాంబర్‌లో ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలకు భగీరథ ద్వారా బల్కు నీరు చేరింది...ఇంట్రావిలేజీ పనులు ఏ మేరకు పూర్తయ్యాయి అనే కోణంలో అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఇంట్రావిలేజీ పనులు మరో 20 శాతం మే రకు పెండింగ్ లో ఉండటంతో వాటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలం వచ్చినప్పటికి వర్షాలు లేని కారణంగా భూగర్భ జలాలు ఇంకిపోయాయని దీంతో మరింత తాగునీటి కరువు వచ్చే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పెండింగ్ పనులు పూర్తి చేసి రిజర్వాయర్లలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుని తాగునీరు అందించాలని సూచించారు. అనంతరం నార్కట్‌పల్లి మండలంలో పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసి అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, ఏఓ సీతాకుమారి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పాపారావు, ఎంపీడీఓ సాంబశివరావు, మిషన్ భగీరథ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...