మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేయాలి


Tue,July 9, 2019 02:41 AM

నీలగిరి: త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలను అధికారులు సమన్వయంతో టీమ్ వర్కు చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపాలిటీ హెడ్‌క్వార్టర్ ఎంపీడీఓలకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, ఏర్పాట్లపై దిశా నిర్దేశం, సూచనలు చేశారు. జిల్లాలోని 7మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేకాధికారులు బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. వార్డుల పునర్వీభజన, ఓటర్ల జాబితా రూపకల్పనపై శ్రద్ధ్ద వహించాలన్నారు. 10న డ్రాప్టు ఓటర్ జాబితాప్రచురణ, 14న తుది ఓటర్ జాబితా ప్రచురణ చేయాల్సి ఉంటుందన్నారు. ఓటర్ జాబితా అభ్యంతరాలు పరిష్కరించి రాత పూర్వకంగా తెలుపాలన్నారు. టీపోల్‌లో మ్యాపింగ్ చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్ల డ్రాప్టు జాబితా ఈనెల 12న మున్సిపాలిటీల్లో ప్రచురించి 12 నుంచి 16 వరకు అభ్యంతరాల స్వీకరణ, 13న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, తుది పోలింగ్ స్టేషన్ జిల్లా ఎన్నికల అథారిటీ ఆమోదంతో 19న ప్రచురించాలన్నారు. డీఎల్‌ఓలతో మంగళవారం సమావేశం నిర్వహించి పోలీంగ్ స్టేషన్లు తనిఖీ చేసి కనీస వసతులు ఉండేలా చూడాలన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు డీఎస్పీ, స్టేషన్ పోలీస్ అధికారితో చర్చించి గుర్తించాలన్నారు. 10 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్, 20 శాతం క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్, మైక్రో ఆబ్జర్వర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి మోడల్ కోడ్ అమలులోకి వస్తుందని, ఎంసీసీఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, వీఎస్‌టీ బృందాలను నియమించి శిక్షణ నివ్వాలన్నారు. సహాయ వ్యయ నియంత్రణ అధికారులు నియమించాలన్నారు. వర్షాకాలంలో బ్యాలెట్ పేపర్లు డ్యామేజ్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్పులైన్ సెంటర్, మున్సిపాలిటీలలో కంట్రోల్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించి ఫిర్యాదులు నమోదు చేసి పరిష్కరించాలన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రెయినర్ తరాల పరమేష్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నామినేషన్లు స్వీకరణ, అభ్యంతరాలు, వ్యాలిడ్ నామినేషన్లు ప్రచురణ, ఇతర ఎన్నికల నిర్వహణ అంశాలపై శిక్షణ, సందేహాలు నివృత్తి చేశారు. సమావేశంలో జేసీ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ పద్మ నాభరెడ్డి, డీఆర్‌వో రవీంద్రనాథ్ పాల్గొన్నారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...