టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రంలో సుభిక్ష పాలన


Mon,July 8, 2019 03:48 AM

- పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేయాలి
- విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
- నేరేడుచర్ల కాంగ్రెస్ పట్టణ, మండలాధ్యక్షుడు మరో 500 మంది టీఆర్‌ఎస్‌లో చేరిక
నేరేడుచర్ల : టీఆర్‌ఎస్ పాలనలోనే ప్రజలకు సుభిక్ష పాలన అందుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. స్థ్ధానిక ఎస్.ఆర్.ఫ్రైడ్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏ ర్పా టు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి అండ, బలమని, పార్టీ కోసం ఇన్నేళ్లు చేసిన సేవలు మరవ లేనివని కొనియాడారు. క్రమశిక్షణతో పని చేసి పార్టీ బలోపేతానికి పాటుపడాలనీ, చిత్తశుద్ధితో పని చేసే కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నా రు. నిఖార్సైన కార్యకర్తలు లేకపోతే పార్టీ మనుగడ చాలా ఏళ్లు కొనసాగదని, పార్టీకి ద్రోహం చేసే వాళ్లకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండవన్నారు. టీఆర్‌ఎస్ కుటుంబంలో అందరూ సమానులేనని అందరూ పార్టీ పటిష్టతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2014కు ముందు, తరువాత రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకొన్నాయన్నారు. మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలను అక్షరం వదలకుండా అమలు పర్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రెండు మార్లు కేం ద్రంలో అధికారంలో చేపట్టిన నరేంద్రమోడీ తన సొంతం రాష్ట్రం గుజరాత్‌లో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడం లేదని, వ్యవసాయ రంగానికి ఇచ్చే కొద్ది గంటల పాటు విద్యుత్‌కు కూడా యూనిట్‌కు రూ. 1.35 వసూళ్లు చేస్తుందని గుర్తు చేశారు. చిత్త శుద్ధితో పార్టీలో పని చేసే వారికి గు ర్తింపు దానంతట అదే వస్తుందని, పదవుల కోసం వెంపర్లాడాల్సిన పనిలేదన్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికే దిక్సూచి అని, ఇప్పటికే చాలా రాష్ర్టాలు టీఆర్‌ఎస్ చేపడుతున్న సంక్షేమ పథకాల అమలుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎం పీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు తమ గ్రామాల్లో స్థానికంగా ఉండి ప్రజా సేవకే పునరంకితం కావాలన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నేరేడుచర్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థ్ధులను గెలిపించుకోవడంతో పాటు మున్సిపల్ కార్యాలయంలో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్ :శానంపూడి
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. రా ష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సముద్రంలో వచ్చే ఉప్పెనలా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలు జరుగుతున్నాయన్నారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగురవేసేలా పని చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు వెంకటనారాయణ గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ రాపోలు నర్సయ్య, ఎంపీపీ లకమళ్ల జ్యోతిభిక్షం, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాటికొండ రామనర్సింహారెడ్డి, కొణతం సత్యనారాయణరెడ్డి, సుంకరి క్రాంతికుమార్, నాగండ్ల శ్రీధర్, దొండపాటి అప్పిరెడ్డి, పేరబోయిన వీరయ్య, పోరెడ్డి శ్రీలతారెడ్డి, వల్లంశెట్ల రమేష్‌బాబు, కుంకు శ్రీను, ఆకారపు వెంకటేశ్వర్లు, చింతగుంట సోమిరెడ్డి, చింతమళ్ల సైదులు, కొణతం ఆదిరెడ్డి, దర్గారావు ఉన్నారు.

కాంగ్రెస్ నుంచి 500 మంది టీఆర్‌ఎస్‌లో చేరిక
నేరేడుచర్ల, మం డల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి, వజ్రపు శేఖర్‌లతో పాటు సుమారు 500 మంది మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరగా వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. పార్టీలో చేరిన వారు బూర్గులతండా, బక్కయ్యగూడెం సర్పంచ్‌లు కోన కవిత, మాలోతు రోజా, పాలకవీడు మండలంలోని ఎల్లాపురం సర్పంచ్ తీగల లక్ష్మీవెంకటరెడ్డి, చిల్లేపల్లి ఎంపీటీసీ తిప్పన శ్రీలక్ష్మి సందీప్‌రెడ్డి, అనంతు శ్రీను, కొణతం చిన్న సీతారాంరెడ్డి, కొణతం కృష్ణారెడ్డి, మచ్చ శ్రీను, నూకల వెంకటరెడ్డి, తీగల శంభిరెడ్డి, శంకరాచారీ తదితరులు ఉన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...