ఆగస్టు 4న బీఆర్‌ఏఓయూ డిగ్రీ అర్హత పరీక్ష


Mon,July 8, 2019 03:47 AM

- నల్లగొండ రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త ధర్మానాయక్
రామగిరి : డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత లేకుండా నేరుగా డిగ్రీలో ప్రవేశించడానికి నిర్వహించే డిగ్రీ అర్హత పరీక్ష ఆగస్టు 4న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతందని యూనివర్సిటీ నల్లగొండ రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త డా.బి.ధర్మానాయక్ తెలిపారు. ఆదివారం నల్లగొండలోని యూనివర్సిటీ ఆర్‌సీసీ భవనంలో కౌన్సిలర్స్(అధ్యాపకులు)లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు డిగ్రీ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను టీఎస్‌ఆన్‌లైన్, ఈసేవా కేంద్రాల్లో ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 4న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 అధ్యయన కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.
డిగ్రీ, పీజీ అడ్మిషన్లు...
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019-20 సంవత్సరానికి గాను డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త బి.ధర్మానాయక్ తెలిపారు. ఆగస్టు 16లోగా డిగ్రీ, పీజీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం అభ్యర్థులంతా ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజులను చెల్లించాలని పేర్కొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...