అతి త్వరలో... ఇంటింటికీ భగీరథ


Sun,July 7, 2019 01:31 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: సాగునీటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఓ వైపు 1.25కోట్ల మాగాణి లక్ష్యంగా ముందుకు వెళు తూ మరోవైపు శుద్ధి చేసిన జలాలను ప్రతి మనిషికి 100లీటర్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరుకల్లా జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కానుండగా ఇందుకు గాను సర్కార్ రూ.2640కోట్లు వెచ్చిస్తోంది. భగీరథ పథకంలో భాగంగా ఆయా సోర్సుల నుంచి నీటిని శుద్ధి చేసి గ్రామాలకు బల్కునీరు అందించేందుకు రూ.2050కోట్లు వెచ్చించి అంతర్గత పనుల కోసం మరో రూ. 590.57కోట్లు ఖర్చు చేస్తోంది. అందులో ఇప్పటి వరకు రూ.1770 కోట్లు ఖర్చు చేసి పనులను వేగవంతం చేసింది.

నెలాఖరుకల్లా ఇంటింటికీ శుద్ధి జలాలు...
మిషన్ భగీరథ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తం గా జూలై 31నాటికి ప్రతి ఇంటికీ శుద్ధి జలాలను సరఫరా చేసే విధంగా సర్కార్ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం పనులు వేగవంతం చేసింది. మిషన్ భగీరథ యంత్రాంగం-గ్రామీణ మంచినీటి సరఫరా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 1078గ్రామాలుండగా అందు లో మిషన్ భగీరథ యంత్రాంగం ఆయా సోర్స్ నుంచి నీటిని తీసుకుని ఇప్పటికే 987గ్రామాలకు బల్కు నీటిని సరఫరా చేస్తోంది. మరో 91గ్రామాలకు వారం రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. అంతర్గత పనులను పరిశీలిస్తే జిల్లాలో 1538 ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాం కులకు గాను 1150ట్యాంకుల పనులు పూర్తయ్యా యి. 4411.6కి.మీ. పైపులైన్లకు గాను 3339.3 కి.మీ. పైపులైన్లు పూర్తయ్యాయి. ఇక జిల్లాలో 3,84,714 ఇండ్లకుగాను 3,84,712ఇండ్లకు నల్లాలు బిగించారు.

రూ.2640కోట్లతో తాగునీరు...
జిల్లా వ్యాప్తంగా 1078 గ్రామాల్లో ఉన్నటువంటి 3,84,714 కుటుంబాల్లో ప్రతి మనిషికి తాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.2640 కోట్లు వెచ్చిస్తోంది. అందులో గ్రామాల వరకు బల్కువాటర్ చేర్చేందుకు గాను రూ.2050కోట్లు కేటాయించగా గ్రామీణ ప్రాం తాల్లో ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణం, నల్లాల బిగిం పు కోసం రూ.590.57కోట్లు వెచ్చిస్తోంది. అందులో ఇప్పటి వరకు మిషన్ భగీరథ పథకానికి రూ.1550 కోట్లు, అంతర్గత పనులకు గాను రూ. 222కోట్లు మొత్తంగా రూ.1770కోట్లు ఖర్చు చేసింది. అయితే భగీరథ పథకం కింద చేపట్టాల్సిన పనులు సంబంధిత గ్రిడ్ యంత్రాంగం 95శాతం పూర్తి చేయగా అంతర్గత పనులను ఆర్‌డబ్ల్యూఎస్ యంత్రాంగం 75శాతం పూర్తి చేసింది. జూలై నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరందించనున్నారు. పట్టణాల్లో ఒక్కొక్కరికీ 135లీటర్లు, గ్రామీణ ప్రాంత వాసులకు 100లీటర్లు సరఫరా చేయనున్నారు.

3 సోర్స్‌ల ద్వారా శుద్ధి జలాలు సరఫరా...
జిల్లా వ్యాప్తంగా 1078గ్రామాలకు తాగునీరందించేందుకు మిషన్ భగీరథ యంత్రాంగం మూడు సోర్స్‌ల ద్వారా నీటిని శుద్ధి చేస్తోంది. అడవిదేవులపల్లి మండలం చిట్యాల, పీఏపల్లి మండల పరిధిలోని ఏకేబీఆర్ ద్వారా శుద్ధి జలాలను ఆయా గ్రామాలు, మున్సిపాలిటీలకు అందజేయనున్నారు. ఉదయ సముద్రం పరిధిలోని పాత పథకాల ద్వారా నల్లగొండతో పాటు సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సరఫరా అవుతుండగా ఏకేబీఆర్ ద్వారా నల్లగొండతో పాటు యాదాద్రి జిల్లాకు సరఫరా చేయనున్నారు. ఇక చిట్యాల నుంచి నల్లగొండ జిల్లాలోనే పలు స్కీమ్‌లకు నీటిని సరఫరా చేసి అక్కడ నుంచి గ్రామీణ ప్రాంతాలకు చేర్చనున్నారు. అంతర్గత పనుల టెండర్లలో ఆలస్యం కారణంగా ఇప్పటి వరకు తాగునీరు అందకపోగా సర్కార్ ఆదేశాల మేరకు వాటిని వేగవంతం చేసి జూలై చివరికల్లా పనులు పూర్తి చేసి అందించాలనే యోచనతో ముందుకెళుతున్నారు.

ఈనెలాఖరు వరకు ఇంటింటికీ తాగునీరందిస్తాం...
జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ నీరు ఈనెల చివరి నాటికి ఇంటింటికీ అందజేసే లా చర్యలు తీసుకుంటు న్నాం. ఇప్పటికే బల్కువాట ర్ 95శాతం గ్రామాలకు చే రుకున్నాయి. ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణం తుది దశలో ఉన్నా యి. ఇంటింటికీ నల్లాల బిగింపు వంద శాతం పూర్తయ్యింది. ఓహెచ్‌ఎస్‌ఆర్, పైపులైన్ల నిర్మాణం పూర్తి కాగానే ప్రతి ఇంటికి శుద్ధి జలాలను సరఫరా చేస్తాం.
-పాపారావు, ఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్, నల్లగొండ

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...